Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కల్లాలో రైతుల చావుకు కేసీఆరే కారణం
- వచ్చేనెలలో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద దీక్ష ొ నేడు గవర్నర్‌కు వినతి
- ధాన్యం కొనేదాక ఉద్యమం ఆగదు : ముగింపు వరి దీక్షలో రేవంత్‌రెడ్డి
- రేవంత్, కోమటిరెడ్డికి నిమ్మరసమిచ్చిన జానారెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
వరి ధాన్యం కొనేదాక ఉద్యమం ఆగబోదని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి చెప్పారు. కల్లాలో రైతుల చావుకు ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. వచ్చేనెల 9 నుంచి 13 లోపు ఢిల్లీ జంతర్, మంతర్ వద్ద దీక్ష చేయనున్నట్టు వెల్లడించారు. ధాన్యం కొనుగోలుపై సోమవారం గవర్నర్‌కు వినతిపత్రం సమర్పిస్తా మన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో రెండురోజుల వరి దీక్ష ముగిసింది. ఈ సందర్భంగా రేవంత్, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇతర నాయకులకు మాజీ సీఎల్పీ నేత కె జానారెడ్డి నిమ్మరసమిచ్చి దీక్షను విరమింపజేశారు. అనంతరం రేవంత్ మాట్లాడుతూ ఎత్తేసిన ధర్నాచౌక్‌లోనే నిస్సిగ్గుగా కేసీఆర్ ధర్నా చేశారని విమర్శిం చారు. వరి ధాన్యం విషయంలో టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కలిసి కొత్త నాటకానికి తెరలేపాయన్నారు. రైతు సమస్యలపై కేంద్రంతో మాట్లాడుతామని చెప్పి, టీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేష్‌రెడ్డి ఇంట్లో మందు తాగి, విందు భోజనం చేసి వచ్చా రని విమర్శించారు. వరి మీద అవగాహన లేని మంత్రులు కేటీఆర్, మహమూద్‌అలీని కేంద్రమంత్రి వద్దకు పంపితే ఏం మాట్లాడుతారని ప్రశ్నించారు. మహమూద్అలీకి వరి మూసి నదిల పండుతున్నదో, కాలువల కింద పండుతదో తెలియదనీ, మంత్రి కేటీఆర్‌కు ఎక్కడ పండుతుందో అవగాహన లేదని విమర్శించారు. వానా కాలం పంట కొనుగోళ్ల కోసం ఏర్పాట్లు చేయాలనే ఇంకిత జ్ఞానం కేసీఆర్‌కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల మీద కక్షతోనే కొనుగోలు జాప్యం చేస్తున్నారని విమర్శించారు. రైతులు కల్లాల్లో చనిపోతుంటే, బీజేపీ నేతలు మాత్రం పార్టీ ఫిరాయిస్తున్నారని చెప్పారు. 'మీరసలు మనుషులేనా? మానవత్వం ఉందా? అన్నం తింటున్నారా? గడ్డి తింటున్నారా?' అని నిలదీశారు. ధాన్యాం కొనాలంటూ గుండు, అరగుండు వెళ్లి కేంద్రాన్ని అడగడం మానేసి, ఉచిత విద్య, వైద్యం మీద సంతకం చేస్తామంటూ కొత్తరాగం ఎత్తుకున్నారని చెప్పారు. వరి రైతులకు ఉరి వేస్తానన్న ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిని సీఎం కేసీఆర్ అందలం ఎక్కించారని గుర్తు చేశారు. రైతులను శాశ్వతంగా ఆదాని, అంబానీలకు బానిసలుగా మార్చే కుట్ర జరుగుతున్నదని విమర్శించారు. పండించిన పంటను కొనని ప్రభుత్వాన్ని బొంద పెడుదామని పిలుపునిచ్చారు. దీక్షలో ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, సీతక్క, కోదండరెడ్డి, అన్వేష్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి తదితరులు మాట్లాడారు.
దీక్షలో ఆమోదించిన తీర్మానాలివే...
- ప్రస్తుత వానాకాలం వరి ధాన్యాన్ని తక్షణమే కొనాలి
- కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి
- తడిసిన ధాన్యాన్ని కూడా ఆంక్షలు లేకుండా కొనాలి
- ధాన్యం కొనుగోళ్లలో రైస్ మిల్లర్ల ప్రమేయం ఉండకూడదు.
- పోయిన రబీ పంట సేకరణలో జరిగిన అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి
- యాసంగి పంటల సాగు విషయంలో ఆంక్షలు పెట్టకూడదు. భూమి స్వభావం, వనరుల అనుకూలతను బట్టి రైతుకు సాగుపై స్వేచ్ఛ ఉండాలి.
- మద్దతు ధరల పరిధిలో ఉన్న ప్రధానమైన పంటలను మద్దతు ధరకు తక్కువ కాకుండా కొనుగోలు చేయాలి
- వ్యవసాయ పంటలకు సమగ్ర మద్దతు ధర, కొనుగోలు విషయంలో చట్టబద్ధత కల్పించాలి.
- సమగ్రమైన విత్తన చట్టాన్ని తెచ్చి నాసిరకం విత్తనాల బారి నుంచి రైతును కాపాడాలి.
- ఏకకాలంలో లక్ష రూపాయల పంటల రుణమాఫీ చేయాలి.
- ప్రకతి వైపరీత్యాల వల్ల జరిగిన పంట నష్టానికి కోర్టు ఆదేశాలమేరకు వెంటనే రైతులకు పరిహారం చెల్లించాలి.