Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కారేపల్లి
పంట సాగు కోసం చేసిన అప్పులు రైతు ఉసురు తీశాయి. ఆ అప్పులు తీర్చే దారి లేక ఆత్మహత్యే శరణ్యమని పురుగుమందు తాగి ప్రాణం తీసుకున్నాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గేటురేలకాయలపల్లిలో సోమవారం జరిగింది. రైతు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..
వాంకుడోత్ పుల్లు(58) తన మూడున్నర ఎకరాల భూమితో పాటు మరో రెండున్నర ఎకరాలు కౌలుకు తీసుకొని మిర్చి, పత్తి సాగు చేశాడు. పత్తి పైరు అధిక వర్షాలకు ఊటపట్టి పోగా, మిర్చి తోటకు తెగుళ్లు ఎక్కువయ్యాయి. గతేడాది, ఈ ఏడాది పెట్టుబడి అప్పు రూ.5 లక్షలు అయింది. మిర్చి తోటకు మరింత పెట్టుబడి పెట్టినా పంట చేతికి వచ్చే అవకాశం అంతంత మాత్రంగానే ఉంది. దీంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలని కుటుంబ సభ్యులతో చర్చించి కుమిలిపోయాడు. సోమవారం తోట వద్దకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిన పుల్లు అక్కడే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.