Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మోర్తాడ్
రోడ్డు ప్రమాదంలో తల్లీ కొడుకు మృతి చెందారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం గుండ్లపేట్ జాతీయ రహదారిపై సోమవారం జరిగింది. ఏఎస్ఐ గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం.. మోర్తాడ్ మండల కేంద్రానికి చెందిన ఎర్రోళ్ల లక్ష్మి (50) తమ కుటుంబ సభ్యులతో ఉపాధి నిమిత్తం మండలంలోని తిమ్మాపూర్ గ్రామానికి ఆరు నెలల కిందట వెళ్లింది. ఆమె పెద్ద కుమారుడు విశ్వనాథ్‌కు ఆరోగ్యం బాగాలేక పోవడంతో చికిత్స కోసం కొన్ని రోజుల కిందట మోర్తాడ్‌కు పంపించింది. విశ్వనాథ్‌ను చూడటానికి తన చిన్న కుమారుడు నరేష్ (18)తో కలిసి ద్విచక్రవాహనంపై మోర్తాడ్ వెళ్లి తిరుగు ప్రయాణమయ్యారు. ఆర్మూర్ నుంచి మెట్పల్లి వైపు వెళ్తున్న ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢకొీన్నారు.