Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దామోదర రాజనర్సింహ వెల్లడి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ధరణి పోర్టల్‌తో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు చెప్పుకునేందుకు కాంగ్రెస్ టోల్‌ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేసిందని టీపీసీసీ ధరణి కమిటీ చైర్మెన్ దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. ఈమేరకు సోమవారం గాంధీభవనవ్లో కమిటీ సభ్యులు కోదండరెడ్డి, అనిల్, కుమార్రావుతో ఆయన సమావేశమయ్యారు. ధరణి పోర్టల్ భూ సమస్యలను పరిష్కరించడం లేదని విమర్శించారు. కాంగ్రెెస్ ఏర్పాటు చేసిన 040 24615602, 040 24601254 టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేసి బాధితులు తమ సమస్యలు చెప్పాలని కోరారు. ఆ సమస్యల పరిష్కారం కోసం తగిన న్యాయ సహాయం, న్యాయ సలహాలు కూడా ఉచితంగా అందిస్తామన్నారు.