Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్ ఎదుట వీఆర్ఏల ధర్నా
నవతెలంగాణ - సిరిసిల్ల టౌన్
వీఆర్ఏలకు పెంచిన పేస్కేల్ వెంటనే అమలు చేయాలని వీఆర్ఏల సంఘం జిల్లా అధ్యక్షులు చందు అన్నారు. వీఆర్ఏల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్ట రేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి మండలం గణపురం గ్రామం లో వీఆర్ఏ పేస్కేల్ రావడం లేదని ఆత్మహత్య చేసుకున్నారని గురు ్తచేశారు. వీఆర్ఏల ప్రాణం పోతున్నా ఇచ్చిన హామీలు ఎందుకు అమ లు చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కుమ్మరి అంజనేయులు, భాను ప్రకాష్, తిరుపతి, రామకృష్ణ, ప్రవీణ్, రమేష్, నరసింహులు, దివ్య, అర్జున్ పాల్గొన్నారు.