Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, ఎఫ్‌సీఐకి హైకోర్టు నోటీసులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్లో పండించిన వరి పంటను కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారనే పిల్‌పై హైకోర్టు స్పందించింది. అసలు ధాన్యం కొనుగోలు విధానం ఏమిటో చెప్పాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర ఆహార భద్రతా సంస్థ, రాష్ట్ర ఆహార భద్రతా సంస్థలకు నోటీసులు జారీచేసింది. న్యాయ విద్యార్థి బి.శ్రీకర్ వేసిన పిల్‌ను సోమవారం చీఫ్ జస్టిస్ సతీష్‌చంద్రశర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ జరిపింది. ధాన్యం కొనుగోలు చేస్తామని రాష్ట్రం చెప్పి చేయడం లేదనీ, రైతుల దగ్గర ఉన్న పంటలు వర్షాలకు పాడైపోయే ప్రమాదం ఉందని పిటిషనర్ వాదించారు.