Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హుజురాబాద్లో కేసీఆర్ అహంకారం ఓడింది
- భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న ఎమ్మెల్యే ఈటల
నవతెలంగాణ-భద్రాచలం
ప్రజల విశ్వాసాన్ని, నమ్మకాన్ని వమ్ము చెయ్యకుండా వారి ఆశయాలకు అనుగుణంగా తాను వ్యవహరిస్తానని మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామిని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ గడ్డ మీదే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజలు ధర్మం గెలవాలనీ, కేసీఆర్ ఓడిపోవాలనీ, ప్రజాస్వామ్యం బతకాలని కోరుకుంటున్నారని తెలిపారు. ఈ క్రమంలోనే హుజూరాబాద్ ఎన్నికల్లో ధర్మం గెలిచి, న్యాయం నిలబడిందన్నారు. న్యాయం, నిబద్ధతతో ముందుకు సాగే విధంగా శక్తినివ్వాలని భద్రాద్రి రామయ్యను కోరుకున్నట్టు చెప్పారు. తామ దేవతలైన సమ్మక్క, సారక్క ఆలయంలో కూడా మొక్కులు చెల్లించుకుంటానని తెలిపారు. ఆయన వెంట బీజేపీ రాష్ట్ర నాయకులు కోనేరు చిన్ని తదితరులు ఉన్నారు.