Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సిద్దిపేట అర్బన్
సీపీఐ(ఎం) సిద్దిపేట జిల్లా నూతన కార్యదర్శిగా మరోసారి ఆముదాల మల్లారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండ్రోజులుగా సిద్దిపేట పట్టణంలో జరిగిన పార్టీ మహాసభల్లో 19మందితో నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా కార్యదర్శిగా ఆముదాల మల్లారెడ్డి, కార్యదర్శివర్గ సభ్యులుగా గోపాలస్వామి, కళావతి, శశిధర్, ఎల్లయ్య, సత్తిరెడ్డి, భాస్కర్, జిల్లా కమిటీ సభ్యులుగా వెంకట్ మావో, యాదగిరి, విజేందర్, బాల్ నర్సయ్య, కిష్టారెడ్డి, శ్రీనివాస్, భాస్కర్, రవి కుమార్, అరుణ్ కుమార్, నవీనా, శారద, ప్రశాంత్‌ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. భవిష్యత్‌లో కార్మిక, కర్షక పోరాటాలు ఉధృతం చేసేలా మహాసభలో పలు తీర్మానాలు చేసినట్టు తెలిపారు.