Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బాన్సువాడ
సీపీఐ(ఎం) కామారెడ్డి జిల్లా కార్యదర్శిగా వెంకట్‌గౌడ్ ఎన్నికయ్యారు. సీపీఐ(ఎం) జిల్లా మహాసభలను బాన్సువాడ పట్టణంలో రెండు రోజలు పాటు నిర్వహించారు. ఈ మహాసభలకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ నంద్యాల నరసింహారెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్.వెంకట్రాములు హాజరయ్యారు. మహాసభల ముగింపు న 11మందితో నూతన జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా కార్యదర్శిగా వెంకట్‌గౌడ్, జిల్లా కమిటీ సభ్యులుగా ఎమ్డీ ఖలీల్, రవీందర్, మోతీరామ్, యాదగిరిగౌడ్, ఎల్లయ్య, సురేష్ గొండ, చంద్రశేఖర్, అజరు, అరుణ్, నర్సిం ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి వెంకట్‌గౌడ్ మాట్లాడుతూ.. జిల్లాలో ప్రజా సమస్యలపై మరింత ఉధృతంగా పోరాటాలు నిర్వహిస్తామనీ, దీని కోసం 10 తీర్మానాలను జిల్లా మహాసభలో ఆమోదించినట్టు తెలిపారు.