Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధరల పెరుగుదలతో బతకలేకపోతున్నాం
- మినిమమ్ బేస్ ఫెయిర్‌ను రూ.35కు పెంచాలి
- డిమాండ్లను పరిష్కరించే వరకు డెలివరీ ఆర్డర్స్ తీసుకోం
- డిసెంబర్ 5 వరకు నిరసన, ఆ తర్వాత పూర్తిస్థాయి సమ్మె
నవతెలంగాణ- సిటీబ్యూరో
పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిన నేపథ్యం కుటుంబాలు గడవడం కష్టంగా మారింది.. మినిమమ్ బేస్ ఫెయిర్‌ను రూ.35కు పెంచాలి.. డోర్‌స్టెప్ డెలివరీ రూ.12కు పెంచాలి.. ఈ డిమాండ్లను యాజమాన్యం పరిష్కరించే వరకు ఫుడ్ డెలివరీ ఆర్డర్ తీసుకునేది లేదని స్విగ్గీ ఫుడ్ డెలివరీ బాయ్స్ స్పష్టం చేశారు. డిసెంబర్ 5లోపు డిమాండ్లు నెరవేర్చకుంటే పూర్తిస్థాయిలో సమ్మెబాట పడతామని తెలంగాణ గూడ్స్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు, ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ బేస్డ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ (IFAT) జాతీయ ప్రధాన కార్యదర్శి షేక్ సలావుద్దీన్ హెచ్చరించారు. సోమవారం స్విగ్గి డెలివరి ఉద్యోగులతో కలిసి యాజమాన్యానికి వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం మీడియాకు వివరాలు వెల్లడించారు. పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, నిత్యావసర ధరలతో బతకలేక ఇబ్బందులు పడుతున్నామని, పిల్లల స్కూల్ ఫీజులు చెల్లించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. డోర్‌స్టెప్ డెలివరీ గురించి కస్టమర్లకు హామీ ఇస్తున్న స్విగ్గి యాజమాన్యం.. తమను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. రోజుకు 10 నుంచి 15 గంటలు పనిచేస్తున్న తమ శ్రమను గుర్తించాలని, కిలో మీటర్‌కు డెలివరీ చార్జీలు పెంచాలని అన్నారు. థర్డ్‌పార్టీ సంస్థలకు ఆర్డర్లు ఇవ్వడం మానుకోవాలని, తమకు మినిమమ్ బేస్ ఫెయిర్‌ను రూ. 35కు పెంచాలని కోరారు. డెర్స్టెప్ డెలివరీ (దూర ప్రాంతాలకు ఇప్పుడిస్తున్న రూ. 6 నుంచి 12కు పెంచాలని డిమాండ్ చేశారు. వీటితోపాటు తమ డిమాండ్లు అన్నీ నెరవేర్చాలని, అందుకోసం నల్లబ్యాడ్జీలు ధరించి ప్రతిరోజూ నిరసన తెలుపుతామని, ఆందోళనలు చేపడతామని చెప్పారు. డిసెంబర్ 5లోపు తమ డిమాండ్లను యాజమాన్యం నెరవేర్చకుంటే ఆ తర్వాత పూర్తిస్థాయిలో నిరవదిక సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు. దాదాపు 10 వేలమంది డెలివరీ కార్మికులు హైదరాబాద్‌లోని అన్ని ప్రధాన జోన్ల నుంచి సమ్మెలో పాల్గొంటారని తెలిపారు. హోటల్ యాజమాన్యాలు, ప్రజలు, కస్టమర్లు తమకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
డిమాండ్లు ఇవే..
- డెలివరీ కార్మికులకు కనీస ధర రూ. 35 చెల్లించాలి... బ్యాచ్ ఆర్డర్ చెల్లింపును కి.మీ. :రూ 20/- పెంచండి
- కస్టమర్ డోర్‌స్టెప్ డెలివరీ చారి రూ. 5 తిరిగి ప్రవేశపెట్టాలి.
- డిస్టెన్స్ ఫెయిర్‌ను ప్రతి కిలోమీటరుకు ప్రస్తుతం ఉన్న రూ.6 నుంచి 12కి పెంచాలి
- నెలవారీ రేటింగ్ ప్రోత్సాహకాన్ని తిరిగి ప్రవేశపెట్టాలి.
- డెలివరీ వ్యాసార్థాన్ని తగ్గించడానికి సూపర్ జోన్లను తీసేయాలి.
- షాడోఫాక్స్, రాపిడో వంటి థర్డ్‌పార్టీ సంస్థలకు ఆర్డర్లను ఇవ్వకూడదు.