Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భద్రాచలం ఏఎస్పీ డాక్టర్ జి.వినీత్
నవతెలంగాణ-భద్రాచలం/చర్ల
నలుగురు సీపీఐ(మావోయిస్టు) సానుభూతిపరులను అరెస్ట్ చేసినట్టు భద్రాచలం ఏఎస్పీ డాక్టర్ జి. వినీత్, చర్ల సీఐ రాజు, ఎస్ఐ రాజు వర్మ ఒక ప్రకటన విడుదల చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఉసూరు మండలం పావురుగూడ, గుంజెపర్తి గ్రామాలకు చెందిన నిషేదిత సీపీఐ(మావోయిస్టు) సానుభూతిపరులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల పోలీసులు, సీఆర్పీఎఫ్ 151 బెటాలియన్, కోబ్రా దళాలు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారు పావురుగూడ, గుంజెపర్తి గ్రామాలకు చెందిన సోడి సోనా, సోడి సోనూ, సోడి ఉర్ర, మడకం సందీప్‌గా గుర్తించారు. వీరు ఉసూర్ ఏరియా కమిటీకి కొన్ని ఏండ్లుగా సానుభూతిపరులుగా పనిచేస్తున్నారని ఏఎస్పీ తెలిపారు.