Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కానీ ఆయన కిసాన్లకు వ్యతిరేకం: జీవన్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేరులో కిసాన్ ఉంది కానీ.. ఆయన కిసాన్లకు వ్యతిరేకమని పీయూసీ చైర్మెన్, ఎమ్మెల్యే పి.జీవన్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన అసెంబ్లీలోని మీడియాతో మాట్లాడుతూ టూరిజం మంత్రి కిషన్‌రెడ్డి రాష్ట్రానికి ఒక టూరిస్టుగా మారారని అన్నారు. కేంద్రమంత్రిగా ఉండి ఆయన ఒక్క రూపాయి తెస్తే ఒట్టని వ్యాఖ్యానించారు. ఒక్క గింజా కొనం అని పీయూష్ గోయల్ అంటుంటే, ప్రతీ గింజా కొంటాం అని కిషన్ రెడ్డి అంటున్నారనీ, వీరిలోఎవరిని నమ్మాలని ప్రశ్నించారు. ఎంపీ అరవింద్ మాట్లాడే మాటలకు నిరసనగా గాంధీ ఆస్పత్రిలో ఆయన మూతికి కుట్లు వెయ్యాలన్నారు. ఆర్ఆర్ఆర్ అంటే రెచ్చగొట్టడం, రచ్చచేయడం, రద్దు చేయడం అని విమర్శించారు. రైతులు ఏ పంటలు వేయాలనేది త్వరలోనే వ్యవసాయ శాఖ అధికారులు చెబుతారని తెలిపారు. ఎమ్మెల్యేలు బాల్క సుమన్, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, ముఠా గోపాల్, జె సురేందర్ మాట్లాడుతూ మా సీఎం కేసీఆర్‌ను మించిన తెలివైన సీఎం దేశంలో ఎవరూ లేరని చెప్పారు. బీజేపీ అనేది పార్టీ కాదనీ, గుజరాత్ కంపెనీ అని విమర్శించారు. బియ్యం ఎగుమతి చేసుకునే స్వేచ్ఛ తమకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తామే కొని విదేశాలకు ఎగుమతి చేస్తామని వ్యాఖ్యానించారు.