Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవీ.రమణ
నవతెలంగాణ - సూర్యాపేట
కల్లు గీత కార్పొరేషన్‌కు రూ.5 వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవీ రమణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. గీతన్నబంధు ప్రకటించి ప్రతి కుటుంబానికీ రూ.10 లక్షలు ఇవ్వాలన్నారు. ఉచితంగా మోటారు సైకిళ్లు పంపిణీ చేయాలని కోరారు. కల్లుగీత సొసైటీకి ఐదెకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కల్లులో ఉన్న పోషకాలు, ఔషధ గుణాల గురించి ప్రభుత్వమే ప్రచారం నిర్వహించి.. విక్రయానికి మార్కెట్ సౌకర్యం కల్పించాలని కోరారు. ప్రతి జిల్లా కేంద్రంలోనూ నీరా, తాటి, ఈత ఉత్పత్తుల పరిశ్రమలు నెలకొల్పి గౌడ కల్లుగీత యువతీ, యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. అర్హులైన వారందరికీ కొత్త జిల్లాల పేరుతో సభ్యత్వం, గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. వృత్తిలో భాగంగా మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్గ్రేష ియా చెల్లించాలని డిమాండ్ చేశారు. అంతకు ముందు పట్టణంలో మోకు, ముస్తాదు, తాటి, ఈత చెట్లతో ప్రదర్శన నిర్వహించారు. సంఘం జిల్లా అధ్యక్షులు ఎల్గురి గోవింద్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సదస్సులో జిల్లా ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కక్కిరేణి నాగయ్యగౌడ్, తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు అబ్బగాని బిక్షం, ఉయ్యాల నగేష్, బోడపట్ల విజయమ్మ, మామిడి నాగమణి తదితరులు పాల్గొన్నారు.