Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఉన్నతాధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని బీఆర్కె భవన్లో మంగళవారం రోడ్లు, భవనాల శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్సత్రితో పాటు ఎనిమిది కాలేజీలు సకాలంలో పూర్తి కావాలని సూచించారు. నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనల ప్రకారం అన్ని కాలేజీలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విస్తరించుకునే విధంగా నిర్మాణాలు ఉండాలని సూచించారు. ఇవి అందుబాటులోకి వస్తే ప్రాథమిక దశలోనే రోగాలకు చికిత్స అందించడం, ఆపత్కాలంలో వెంటనే అత్యవసర సేవలు అందించడం సాధ్యమవుతుందన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం.రిజ్వీ, అర్ అండ్ బీ ఇఎన్సి గణపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.