Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐకేపీ కొనుగోలు కేంద్రం వద్ద ఘటన
నవతెలంగాణ-వేలేరు
మిల్లర్లు క్వింటాకు 10 కిలోల చొప్పున తరుగు తీస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తూ రైతులు ఐకేపీ కేంద్రం ఎదుట వరి ధాన్యానికి నిప్పుపెట్టి నిరసన తెలిపారు. ఈ ఘటన హనుమకొండ జిల్లా వేలేరు మండల కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రం వద్ద 40 కిలోల బస్తాకు 2 కిలోలు తరుగు తీస్తుండగా, మళ్లీ మిల్లర్లు బస్తా నుంచి 2-3 కిలోలు తరుగు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో ఒక్కో రైతు క్వింటాకు సుమారు 10 కిలోలు నష్టపోతున్నట్టు చెప్పారు. మడికొండలోని ఓంకారేశ్వర, విజ్ఞేశ్వర, రాంపూర్‌లోని శ్రీనివాస, రామలింగేశ్వర మిల్లర్లతో ప్రజాప్రతినిదులు, అధికారులు మాట్లాడి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విషయం తెలిసి ఎంపీపీ సమ్మిరెడ్డి, జెడ్పీటీసీ సరిత కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడారు. మిల్లర్లతో ఫోన్లో సమస్యను వివరించారు. రైతులు ఆందోళన చెందొద్దని కోరారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా ఇవ్వడంతో ఆందోళన విరమించారు.