Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్నారై టీఆర్ఎస్ యూకే అధ్యక్షులు అశోక్ గౌడ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎన్నారై టీఆర్ఎస్ యూకే (లండన్) శాఖ మంగళవారం పదకొండో వార్షికోత్సవం జరుపుకుంటున్న నేపథ్యంలో ఖండాంతరాల్లో గులాబీ జెండా మోసే అవకాశం కల్పించిన పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌కు ఎన్నారై టీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నారై టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి వెన్నుతట్టి ప్రోత్సహించిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోశ్‌రావు, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలకు అశోక్‌గౌడ్ దన్యవాదాలు తెలియజేశారు. లండన్ వేదికగా ప్రారంభమైన ఎన్నారై టీఆర్ఎస్ శాఖ మొదటి రోజు నుంచి నేటి వరకు ఎంతో క్రియాశీలకంగా పనిచేస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలిచిందన్నారు. అలాగే మమ్మల్ని నడిపిస్తున్న ఎన్నారై టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం, సీనియర్ నాయకులు సి చంద్రశేఖర్‌గౌడ్, ఎన్నారై టీఆర్ఎస్ కోఆర్డినేటర్‌గా బాధ్యత చేపట్టినప్పటి నుంచి మమ్మల్ని సమన్వయ పరుస్తున్న మహేష్ బిగాల అభినందనీయులని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.