Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్ర పోలీసు శాఖ
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో మత్తు పదార్థాల రవాణా, వినియోగం, విక్రయాలపై ఉక్కుపాదం మోపేందుకుగాను కొత్తగా డ్రగ్స్ అఫెండర్స్ ప్రొఫైల్ అనాల్సిస్ మానీటర్ సిస్టమ్(డీఓపీఏఎంఎస్) అనే కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని రాష్ట్ర పోలీసు శాఖ ప్రవేశపెట్టింది. దీనివలన రాష్ట్రంలో ఎక్కడైనా డ్రగ్ విక్రయదారులు, స్మగ్లర్లు, రవాణాదారులు ఎక్కడ దొరికినా వారి వివరాలను ఈ సిస్టమ్లోకి వెంటనే చేర్చేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉన్నతాధికారులు ప్రవేశపెట్టారు. దీనివల్ల రాష్ట్రంలో ఏమూలన డ్రగ్స్ వియ్రదారులు పట్టుబడ్డా వారి వివరాలు ఇతర పోలీసు స్టేషన్ల అధికారులుకు వెంటనే చేరేలా ఈ సిస్టమ్ ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఇప్పటి వరకు డ్రగ్స్ సరఫరా చేస్తూ పట్టుబడ్డ నిందితులు వారి వివరాలు కొన్ని ప్రాంతాల పోలీసులకే పరిమితమయ్యేది.
దానివల్ల ఇతర పోలీసుస్టేషన్ల అధికారులకు సమాచారం లేక ఇబ్బందికి గురయ్యే వారని అధికారులు తెలిపారు. తాజా విధానంతో డ్రగ్స్ మాఫియాపైనా ఉక్కు పాదం మోపడానికి వీలవుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా గంజాయి రవాణాను అడ్డుకోవడానికి ఈ విధానం ఎంతగానో తోడ్పడుతుందని పేర్కొన్నారు.