Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సబితాఇంద్రారెడ్డి వెల్లడి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కోవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యాసంస్థలను కొనసాగించాలని ఇటీవల జరిగిన మంత్రి మండలి సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. 'సోషల్ మీడియాలో పాఠశాలలకు సెలవులంటూ వస్తున్న ప్రచారాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు నమ్మవద్దు. మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిద్దాం.కరోనా వ్యాప్తిని కట్టడి చేద్దాం. విద్యా సంస్థల యాజమాన్యాలు అన్ని రకాల కోవిడ్ జాగ్రత్తలు పాటించాలి' అని పేర్కొన్నారు.
ఒమిక్రాస్పై విద్యార్థులు ఆందోళన చెందొద్దు : విద్యామండలి చైర్మెన్ లింబాద్రి
ఒమిక్రాన్‌పై విద్యార్థులు ఆందోళన చెందొద్దని విద్యామండలి చైర్మెన్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లో యూనివర్సిటీల వీసీలతో ఉన్నత విద్యామండలి భేటీ అయ్యారు.