Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రం తీరుతోనే తడిసిన ధాన్యాన్ని కొనలేకపోతున్నాం
- బీజేపీ, కాంగ్రెస్‌లకు కొనుగోలు కేంద్రాల గురించి మాట్లాడే నైతిక హక్కులేదు:
ఆర్థిక, వైద్యశాఖ మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ- నారాయణఖేడ్
ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలన్నీ అబద్ధాలే అని ఆర్థిక, వైద్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మెదక్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లతో సోమవారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఒక్క సంగారెడ్డి జిల్లాలోనే 157 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి 70 శాతం పంట కొనుగోలు పూర్తి చేశామని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్‌కు కొనుగోలు కేంద్రాలపై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. కొనుగోలు విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలన్నీ అబద్ధాలేనన్నారు. పీయూష్ గోయల్ వైఖరి ఒకలా, కిషన్‌రెడ్డి మాటలు మరోలా ఉంటున్నాయని ఆరోపించారు. కేంద్రం తీరుతోనే తడిసిన వడ్లు కొనలేక పోతున్నామని తెలిపారు. బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పనులను త్వరలోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభిస్తామన్నారు.