Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ
నవతెలంగాణ-బోనకల్
నిరంకుశ పాలనకు నిశ్శబ్ద విప్లవం రైతు సంఘాల పోరాటమని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ అన్నారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండల కేంద్రంలోని స్థానిక సాయిబాబా కళ్యాణ మండపంలో మంగళవారం జక్కుల రామారావు, దొండపాడు రమేష్, కొండపర్తి గోవిందరావు అధ్యక్ష జరిగిన ఆ సంఘం 20వ జిల్లా మహాసభల్లో ఆమె పాల్గొన్నారు. మహాసభల ప్రారంభ సూచికగా తొలుత రైతు సంఘం జెండాను సీనియర్ నాయకులు అడపా రామకోటయ్య ఆవిష్కరించారు. అనంతరం జరిగిన మహాసభలో ఆమె మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనలో నేడు దేశ ప్రజలు అనేక ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో రైతుల పోరాటం ప్రపంచానికే ఆదర్శం అన్నారు. ఈ పోరాటాన్ని సమర్థిస్తూ ప్రపంచంలోనే 23 దేశాలు మద్దతు తెలుపుతూ వారి పార్లమెంట్లో తీర్మానాలు కూడా చేశాయని తెలిపారు. ఈ దేశంలో నిరంకుశ పాలన కొనసాగనివ్వమని రైతు ల పోరాటం రుజువు చేసిందన్నారు. కేరళలో పంటల కు 22 శాతం ప్రభుత్వం కలిపి పంటలకు మద్దతు ధర ప్రకటించిందనీ, ఇక్కడ కేసీఆర్ ఎందుకు అలా ప్రకటించరని ప్రశ్నించారు. మహాసభలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు భాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, జిల్లా కార్యవర్గ సభ్యులు జమ్ముల జితేందర్‌రెడ్డి, తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మెడకంటి వెంకటరెడ్డి, ఆహ్వాన సంఘం అధ్యక్షకార్యదర్శులు తోట రామాంజనేయులు, ఎంగల ఆనందరావు, తదితరులు పాల్గొన్నారు.