Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నీట్-పీజీ-2021 కౌన్సిలింగ్ నిర్వహించటంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న జాప్యానికి నిరసనగా జూనియర్ డాక్టర్లు బయటి రోగుల సేవలను నిలిపివేశారు. హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రితో పాటు రాష్ట్రంలోని పలు ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో బుధవారం ఉదయం ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (టీ-జూడా) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ సాగర్, డాక్టర్ కార్తీక్ తదితరులు మాట్లాడుతూ వెంటనే కౌన్సిలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. దేశంలో ధర్డ్ వేవ్ రానుందనే హెచ్చరికల నేపథ్యంలో డాక్టర్లను సన్నద్ధం చేయాల్సిన సర్కారు..... ఆ దిశగా చర్యలు తీసుకోవటం లేదని విమర్శించారు. ఇప్పటికే ఆలస్యమైందని కౌన్సిలింగ్ ప్రక్రియను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 3 లోపు సమస్యను పరిష్కరించకుంటే ఉద్యమాన్ని మరింత ఉధతం చేస్తామని హెచ్చరించారు.