Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గవర్నర్‌కు కాంగ్రెస్ వినతి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రైతుల నుంచి వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనేలా చర్యలు తీసుకోవాలని టీపీసీసీ కోరింది. ఈమేరకు బుధవారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు కాంగ్రెస్ బృందం వినతిపత్రం సమర్పించింది. అనంతరం ఆ పార్టీ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలనీ, రైతుల ఖాతాల్లో డబ్బులు జమా అయ్యేలా ఆదేశించాలని కోరారు. ధాన్యం కొనుగోలు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు. యాసంగి పంట తీసుకుంటామని చెప్పాల్సిన బాధ్యత కేంద్రంపై ఉన్నారు. సీనియర్ నేత వి హనుమంతరావు మాట్లాడుతూ ఈనెల 12న ఢిల్లీ జంతర్, మంతర్ వద్ద ధర్నా చేస్తామనీ, రైతులపై ప్రేమ ఉంటే టీఆర్ఎస్, బీజేపీ కలిసి రావాలని సవాల్ విసిరారు. గవర్నర్‌ను కలిసిన వారిలో ఎమ్మెల్యేలు సీతక్క, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, సీనియర్ నేతలు కోదండరెడ్డి, షబ్బీర్ అలీ, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర చైర్మెన్ అన్వేష్‌రెడ్డి ఉన్నారు.