Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఎయిడ్స్ సంబంధిత వ్యాధుల కారణంగా 2020-21 సంవత్సరంలో 2,568 మంది మరణించారు. అదే సమయంలో కొత్తగా 2,568 మంది హెచ్ఐవీ బారిన పడ్డట్టు గుర్తించారు. 167 హెచ్ఐవీ సెంటర్లుండగా, వ్యాధిగ్రస్తులకు సేవలందించేందుకు 22 యాంటీ రిట్రోవైరల్ థెరపీ సెంటర్లు పని చేస్తున్నాయి. పట్టణాల్లో 52, గ్రామాల్లో హైరిస్క్ గ్రూపులను గుర్తించారు. గతేడాది 4,60,531 మంది సాధారణ ప్రజలకు, 7,61,954 మంది గర్భిణిలకు పరీక్షలను నిర్వహించారు. కాగా 75,85,920 కండోమ్‌లను పంపిణీ చేశారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో సాక్స్‌తో కలిసి ఎయిడ్స్‌పై పోరాటంలో కలిసి పని చేస్తున్న స్వచ్ఛంద సంస్థలు, కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్ల వద్ద 78,605 మంది మహిళా సెక్స్ వర్కర్లు, 17,674 మంది మెన్ సెక్స్ విత్ మెన్ (ఎంఎస్ఎం), 1,172 మంది ట్రాన్స్ జెండర్లు, 965 మంది మత్తు బానిసలు, 1,39,113 మంది వలసజీవులు, 2,00,721 మంది ట్రక్కర్లు నమోదు చేసుకున్నట్టు సమాచారం.