Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి హరీశ్ రావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఎయిడ్స్ నియంత్రణ, చికిత్స, అవగాహన కోసం ప్రభుత్వం రూ.50 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నదని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు తెలిపారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ ఛాతి ఆస్పత్రిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. హై రిస్క్ గ్రూప్ వారిని కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రజల్లో అవగాహన పెరగటంతో 90 శాతం మరణాలు తగ్గాయని చెప్పారు. తెలంగాణ ఏర్పడక ముందు ఎయిడ్స్ రోగుల శాతం 0.7గా ఉంటే ప్రస్తుతం అది 0.4 శాతానికి తగ్గిందని వెల్లడించారు. ఎయిడ్స్‌పై పోరాటంలో స్వచ్ఛంద సంస్థల పాత్ర కీలకమైందని ప్రశంసించారు.