Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీనియర్ పాత్రికేయులు కల్లూరి భాస్కరం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలుగు పత్రికా రంగానికి నార్ల వెంకటేశ్వరరావు చేసిన సేవలు ఎంతో గొప్పవని సీనియర్ పాత్రికేయులు, రచయిత కల్లూరి భాస్కరం అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో నార్ల జయంతిని పురస్కరించుకుని 'నార్ల బాటలో ముందున్నామా- వెనకబడ్డామా' అనే అంశంపై స్మారకోపన్యాసం జరిగింది. ఈ సందర్భంగా భాస్కరం మాట్లాడుతూ గతంలో అటు సాహిత్యంలో, ఇటు జర్నలిజంలో గ్రాంథిక భాషను విరివిగా వాడేవారని గుర్తు చేశారు. నార్ల ప్రజలు వాడే భాషనే పత్రికా భాషగా మార్చారని చెప్పారు. పాత్రికేయ ప్రస్థానంలో నార్ల ఎక్కడ తప్పటడుగు వేయలేదనీ, సంపాదకీయాల ద్వారా ప్రశ్నించడమే అలవాటుగా మార్చుకున్నారని వివరించారు. అధ్యక్షత వహించిన విశ్వవిద్యాలయ ఉపకులపతి కె సీతారామారావు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో నార్లలాంటి పాత్రికేయులు సమాజానికి చాలా అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ అకడమిక్ డైరెక్టర్ ఈ సుధారాణి, ఇంఛార్జీ రిజిస్ట్రార్ ఎవిఎన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.