Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం, మంత్రులకు లేదా?
- ఒకరేమో వేయాలంటరు.. మరొకరు వద్దంటరు..ఏది నిజం : జూలకంటి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
'సీఎం కేసీఆర్, మంత్రులు, ఉన్నతాధికారులు వచ్చే సీజన్లో వరివేయొద్దని చెబుతున్నారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్రావునేమో వరే వేయండి. రాష్ట్ర ప్రభుత్వం, మిల్లర్లతో కొనుగోలు చేయించే బాధ్యత తీసుకుంటా. రైతులు అధైర్యపడొద్దు అంటున్నడు. ఏది నిజం? ఏది అబద్ధం? రైతులు ఎవరి మాటలు నమ్మాలి?ఎమ్మెల్యేకున్న పవర్ సీఎం, మంత్రులకు లేదా?' అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ప్రశ్నించారు. దయచేసి రైతుల జీవితాలతో ఆటలాడుకోవద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హితవు పలికారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో, మిల్లర్లతో వచ్చే ధాన్యం మొత్తం కొనిపిస్తానని చెబుతున్న భాస్కర్‌రావుకు ఇప్పుడు ధాన్యం అమ్ముకునేందుకు రైతులు పడుతున్న కష్టాలు కండ్లకు కనబడటం లేదా? అని ప్రశ్నించారు. సాగర్ ఆయకట్టు కింద రెండో పంటకు నీళ్లు ఇప్పిస్తాననీ, రైతులు వరే వేయాలని ఎమ్మెల్యే భాస్కర్‌రావు చెప్పటంలో వాస్తవం ఏమేరకు ఉందో సీఎం కేసీఆర్ చెప్పాలని కోరారు. ఒకరు వరి వేయాలంటారు...మరొకరు వద్దంటారు.. అసలు వేయాలా? వద్దా? అనే విషయంలో ఏదీ క్లారిటీ లేదని విమర్శించారు.