Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ములుగు జిల్లాలో కల్లం వద్దే రైతు ఆత్మహత్య
నవతెలంగాణ-ఏటూరునాగారం
ధాన్యం కొనుగోలు చేసే వారు లేక కల్లం వద్దే ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో బుధవారం జరిగింది. శివపూర్ గ్రామానికి చెందిన బేతెల్లి రాములు (42) ఏడెకరాల్లో వరి సాగు చేశాడు. ఈ క్రమంలో ధాన్యాన్ని విక్రయించేందుకు యత్నించగా గ్రామంలో ప్రభుత్వం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయలేదు. పది రోజులుగా రాములు ధాన్యం విక్రయం కోసం విఫలయత్నం చేశాడు. అయినా కొనుగోలు చేసే పరిస్థితి కనిపించకపోవడంతో పెట్టుబడి కోసం చేసిన అప్పు తీర్చలేననే వేదనను కుటుంబ సభ్యుల వద్ద వెలిబుచ్చాడు. ఈ క్రమంలోనే బుధవారం కల్లం వద్దనున్న ధాన్యం బస్తాల వద్దే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య, కూతురు ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.