Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొత్తగా 550డి ఎల్ఆర్ఎఫ్ బార్ల తయారీ
హైదరాబాద్ : టీఎంటీ బార్లను తయారీదారు రాధా స్మెల్టర్స్ తన ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి వచ్చే 2025 నాటికి రూ.100 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్టు ప్రకటించింది. దీంతో ప్రస్తుతం ఏడాదికి 4 లక్షల టన్నులుగా ఉన్న ఉత్పత్తి సామర్థ్యాన్ని 10 లక్షల టన్నులకు చేర్చనున్నట్టు వెల్లడించింది. గురువారం హైదరాబాద్‌లో ఆ కంపెనీ చైర్మెన్ సునీల్ సరఫ్, ఎండీ సుమన్ సరఫ్ ఇతర డైరెక్టర్లు కలిసి కంపెనీ కొత్తగా తయారు చేసిన 550డి ఎల్ఆర్ఎఫ్ టీఎంటీ బార్ల బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా సునీల్, సుమన్ మాట్లాడుతూ ఈ టెక్నాలజీ బార్ల ఉత్పత్తి కోసం రూ.70 కోట్ల పెట్టుబడి పెట్టామన్నారు. దీంతో మెదక్ జిల్లాలోని తమ ప్లాంట్‌ను ఇటీవల 2 లక్షల టన్నుల నుంచి 4 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యానికి చేర్చామన్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరం (2020-21)లో రూ.530 కోట్ల టర్నోవర్ నమోదు చేశామన్నారు. 2021-22లో రూ.1000 కోట్లు, తర్వాత ఏడాదిలో రూ.1500 కోట్ల టర్నోవర్‌ను చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. తెలుగు రాష్ట్రాల్లో తమకు 300 పైగా డీలర్లున్నారని తెలిపారు. వినియోగదారుల డిమాండ్‌ను చేరడానికి వచ్చే రెండు, మూడేండ్లలో మరో ప్లాంట్‌ను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నామన్నారు.