Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బాల్యం నుంచే లలిత కళల్లో శిక్షణ పొందటం వల్ల పిల్లల్లో ఆత్మస్థైర్యం పెరుగుతుందనీ, మానసికంగానూ ఎదుగుతారని బాల్భవన్ డైరెక్టర్ ఉషారాణి చెప్పారు. హైదరాబాద్‌లోని నాంపల్లిలో గల బాల్భవన్ డైరెక్టరేట్‌లో ఆమెను సూర్యాపేట,వనపర్తి,కరీంనగర్ జిల్లాలకు చెందిన బాలభవన్‌ల సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిశారు. తమతమ బాలకేంద్రా లను బాలభవన్లుగా అప్‌గ్రేడ్ చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ.. పిల్లలకు విద్యతో పాటు సంస్కృతి, సాంప్రదాయాల పట్ల అవగాహన కల్పించాలన్నారు. లలిత కళల్లో శిక్షణ పొందడానికి బాల్భవన్లు చక్కగా ఉపయోగపడతాయని చెప్పారు. తెలంగాణ బాల కేంద్రాల ఉద్యోగుల యూనియన్ అధ్యక్షులు బండి రాధాకృష్ణారెడ్డి మాట్లాడుతూ..లలిత కళలు ఉచిత శిక్షణనిచ్చే తమను గుర్తించి జిల్లాల్లోని బాల కేంద్రాలను బాల్ భవన్‌గా అప్‌గ్రేడ్ చేసి రెగ్యులర్ చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తాము గతం కంటే ఎక్కువగా బాల్ భవన్ విధులు శ్రద్ధగా నిర్వర్తిస్తామని హామీనిచ్చారు. లలిత కళల శిక్షణ నేటి సమాజానికి అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో డైరక్టరేట్ సిబ్బంది రామచందర్, వరలక్ష్మి, శ్రీనివాస్‌రెడ్డి, కిషన్, ముక్కంటి, తదితరులు పాల్గొన్నారు.