Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గురుకులాల్లో వరసగా కరోనా బారిన పడుతున్న విద్యార్థినులు
- ఇంద్రేశం బీసీ గురుకులంలో మరో 25 మందికి పాజిటివ్
నవతెలంగాణ - పటాన్ చెరు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పారిశ్రామికవాడలోని గురుకులాల్లో విద్యార్థులు కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. గత సోమవారమే మండలంలోని ముత్తంగి మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే బీసీ సంక్షేమ వసతి గృహంలో 48 మంది విద్యార్థులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఆ ఘటన నుంచి తేరుకోకముందే మండలంలోని మరో బీసీ గురుకులంలో 25 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. మండలంలోని ఇంద్రేశం గ్రామంలోని టర్బో ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహిస్తున్న మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే బీసీ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాలలో (రామచంద్రాపురం బ్రాంచ్) బుధవారం తొమ్మిదో తర గతి చదువుతున్న ఇద్దరు బాలికలు అస్వస్థతకు గురికావడంతో వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. దాంతో గురువారం 300 మందికి పరీక్షలు నిర్వహించగా అందులో 25 మంది విద్యార్థినులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వారిని వసతి గృహంలోని పై గదిలో ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు ప్రిన్సిపాల్ సత్యానంద్ రెడ్డి తెలిపారు.