Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్యాంకును మోసగించిన నందీ గ్రేయిన్స్ సంస్థ
- నలుగురు డైరెక్టర్లపై సీబీఐ కేసులు నమోదు
నవ తెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
కోట్ల రూపాయల రుణాన్ని తీసుకుని బ్యాంకుకు కుచ్చ టోపీ పెట్టిన మరో సంస్థ ఉదంతం వెలుగు చూసింది. 61 కోట్ల రూపాయల మేరకు బ్యాంక్ ఆఫ్ బరోడా హైదరాబాద్ బ్రాంచ్‌కు మోసం నందీగ్రేయిన్స్ డెరివేయిటీవ్ ప్రయివేట్ సంస్థ ఉదంతాన్ని సీబీఐ అధికారుల దర్యాప్తులో వెలుగు చూసింది. సీబీఐ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం కమల్పూరికాలనీలో నందీగ్రేయిన్స్ డెరివేయిటీవ్స్ సంస్థ పేరిట సురేష్‌కుమార్ శాస్త్రి, శ్రీధర్‌రెడ్డి సంజ్జల, ఎస్పీవై రెడ్డి, శేషిరెడ్డిలు వ్యాపారాన్ని సాగిస్తున్నారు. ఆగ్రో కంపెనీని నిర్వహిస్తున్న వీరు హైదరాబాద్ బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ నుంచి 2002లో రూపాయలు 27.72 కోట్ల రూపాయలను రుణంగా తీసుకున్నారు. ఈ రుణాన్ని చెల్లించక పోవడమే గాక దానికి సంబంధించిన వడ్డీని వారు చెల్లించలేదు. దీంతో ఆ సంస్ధ మొండి బకాయిలు రూ. 61.27 కోట్లకు చేరింది. అంతేగాక ఈ సంస్థ నిర్వాహకులు ఈ రుణాన్ని అవసరమైన దానికి వినియోగించకుండా వేరే ఖర్చులకు వాడినట్టు సీబీఐ దృష్టికి వచ్చింది. ఈ మేరకు బరోడా బ్యాంక్ అధికారి సరేష్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంస్థ నిర్వాహకులపై చీటింగ్‌తో పాటు పలు కేసులను సీబీఐ అధికారులు నమోదు చేశారు. అంతేగాక వీరి అక్రమాలకు సహకరించిన మరి కొందరు బ్యాంకు అధికారులు, ఇతర ప్రభుత్వ అధికారులపైన కూడా సీబీఐ అధికారులు కేసులను నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.