Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుండెపోటుతో కొనుగోలు కేంద్రంలో కౌలు రైతు మృతి
- నంగునూరు మండలం బద్దిపడగలో విషాదం
నవతెలంగాణ-నంగునూరు
ఆరుగాలం కష్టపడి పండించిన పంటను విక్రయించడానికి 10 రోజుల నుంచి కొనుగోలు కేంద్రంలో పడిగాపులు కాసిన కౌలు రైతు.. తీరా పంటను కాంటా వేసే సమయంలో ధాన్యాన్ని బస్తాల్లో నింపుతుండగా గుండెపోటుతో కుప్పకూలాడు. ఈ విషాదకర ఘటన సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం బద్దిపడగలో గురువారం జరిగింది.వివరాల్లోకి వెళ్తే..బద్దిపడ గకు చెందిన వడ్లూరి రాములు(42) అదే గ్రామానికి చెందిన దండ్ల ఎల్లయ్య ఎకరం పొలం కౌలుకు తీసుకుని వరి సాగు చేశాడు. 10 రోజుల కిందట పాలమాకుల సహకార సంఘం ఆధ్వర్యంలో గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని తీసుకొచ్చాడు. తేమశాతం సరిగ్గా రావడం కోసం ప్రతిరోజూ ఆరబెడుతూ అక్కడే ఉన్నాడు.గురువారం సాయంత్రం ధాన్యం సీరియల్ రావడంతో కొనుగోలు కేంద్రం నిర్వాహకులు అతనికి బార్దాన్ సంచులు ఇచ్చి నింపమన్నారు.ఆరబోసిన ధాన్యాన్ని దగ్గరికి చేసి సంచుల్లో నింపుతున్న క్రమంలో రాములకు ఛాతిలో నొప్పి వస్తున్నదంటూ అస్వస్థతకు గురయ్యాడు. కొద్దిసేపటికి తేరుకొని మళ్లీ పనిచేస్తుండగా గుండెపోటు వచ్చిం ది.వెంటనే108అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. రాములకు భార్య, నలుగురు కుమార్తెలు ఉన్నారు.