Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
నవతెలంగాణ- నల్లగొండ
ఆర్టీసీ చార్జీల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో గురువారం నల్లగొండ జిల్లా కేంద్రంలో నిరసన తెలిపారు. సుభాష్ విగ్రహం వద్ద ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. డీజిల్ ధరల భారం పేరుతో ఆర్టీసీ చార్జీలు పెంచాలనే ఆలోచన విరమించుకోవాలని సీపీఐ(ఎం)రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి డిమాండ్ చేశారు. ఆర్టీసీని రక్షించడానికి బడ్జెట్లో నిధులు కేటాయిస్తామని చెప్పి సంస్థ పరిరక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోకుండా చార్జీలు పెంచి ప్రజలపై భారాలు వేస్తామనడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు ఎండి.సలీం, దండెంపల్లి సత్తయ్య, తుమ్మల పద్మ, నాయకులు ఊట్కూరి నారాయణ రెడ్డి, అద్దంకి నర్సింహా, పోలె సత్యనారాయణ, భూతం అరుణ, నకెరేకంటి సుందరయ్య, వెంకటేశ్వర్లు, సైదులు నగేష్, రమేష్ పాల్గొన్నారు.