Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మధుసూదనాచారివైపే కేసీఆర్ మొగ్గు
- ఎమ్మెల్యేల కోటాలో ఎన్నికైన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి అసెంబ్లీ స్పీకర్‌గా పని చేసిన మధుసూదనాచారి...త్వరలో శాసనమండలి చైర్మెన్‌గా నియమితులు కానున్నారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆయన... మండలి చైర్మెన్ కుర్చీలో కూర్చోనున్నారు. సీఎం కేసీఆర్ కూడా ఆయన వైపే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. మండలి చైర్మెన్‌గా ఉన్న ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి పదవి ముగియడంలో ఆయన స్థానంలో మధుసూదనాచారిని నియమించే అవకాశం ఉన్నట్టు ఆ వర్గాలు చెబుతున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మధుసూదనాచారి భూపాలపల్లి నియోజకవర్గంలో ఓడిపోయారు. దీంతో ఆయన ఎటువంటి పదవి లేకుండానే ఉన్నారు. ఇటీవల గవర్నర్ కోటాలో ఖాళీ అయిన స్థానంలో ఆయన పేరును సీఎం ఖరారు చేసిన విషయం తెలి సిందే. ప్రస్తుతానికి ప్రొటెం చైర్మెన్‌గా ఉన్న భూపాల్‌రెడ్డి శాసనమండలిని నడిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి చైర్మెన్‌గా చారిని నియమిం చడంతోపాటు అసెంబ్లీ మాజీ స్పీకర్‌కు తగిన గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంలో సీఎం ఆ బాధ్యతలు అప్పగిస్తున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ కొనసాగుతున్నది. ఎమ్మెల్యే కోటాలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్రావు, పాడి కౌశిక్‌రెడ్డి, పరుపాటి వెంకట్రా మిరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం చైర్మెన్ భూపాల్‌రెడ్డి శాసనమం డలిలోని తన చాంబర్లో వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కారక్ర మానికి శాసన సభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, మంత్రులు మహమూద్ అలీ, సత్యవతిరాథోడ్, జగదీష్‌రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ నరసింహచార్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తదితరులు హాజరయ్యారు.