Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- మట్టెవాడ
వరంగల్ నగరం లోని జెమిని థియేటర్ లో గురువారం సాయంత్రం షార్ట్ సర్క్యూట్ జరిగి ఒక్క సారిగా పొగలు అలుము కున్నాయి. దాంతో ప్రేక్షకులు ఆందోళనకు గురయ్యి భయంతో పరుగులు తీశారు. థియేటర్ నిర్వాహకులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం అఖండ సినిమా రిలీజ్ కావడంతో థియేటర్ అంతా ఫుల్‌గా ఉంది. ప్రేక్షకులు మైమరిచి సినిమా చూస్తున్నారు. ఈ క్రమంలో థియేటర్ వెనుక భాగంలో లైట్స్‌కు అనుసంధానంగా ఉన్న కరెంట్ స్విచ్ బోర్డులో షార్ట్ సర్క్యూట్ జరిగింది. దాంతో ఒక్కసారిగా పొగలు అలుముకొని థియేటర్ మొత్తం వ్యాపించాయి. భయాందోళనకు గురైన ప్రేక్షకులు ఒక్కసారిగా ఆందోళనకు గురై బయటికి పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన థియేటర్ నిర్వాహకులు విద్యుత్ సరఫరాను నిలిపివేసి అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేశారు. అగ్నిమాపకసిబ్బంది మంటలు ఆర్పి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. దాంతో ప్రేక్షకులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.