Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : కార్పొరేట్ సామాజిక బాధ్యత (సిఎస్ఆర్)లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందుందని ఆ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ (ఆర్అండ్డిబి) చల్లా శ్రీనివాసులు శెట్టి అన్నారు. గురువారం హైదరాబాద్ పర్యాటనలో భాగంగా ఆయన బ్యాంక్ ప్రధాన కార్యాలయం కోటి వద్ద ఏర్పాటు చేసిన ఎస్బిఐ ఇ-కార్నర్‌ను లాంచనంగా ప్రారంభించారు. ఈ కేంద్రం వద్ద అన్ని వేళల నగదు ఉపసంహరణ, జమ, నగదు నిల్వ, పాస్‌బుక్ ప్రింటింగ్ తదితర సేవలను పొందడానికి వీలుగా రూపకల్పన చేశారు. ఒక వేళ దేశంలో కరోనా మూడో దశ వస్తే వైద్య సవాళ్లను ఎదుర్కోవడానికి సిఎస్‌ఆర్‌లో భాగంగా పలు ఆసుపత్రులతో భాగస్వామ్యం అవుతున్నట్లు ఎస్బిఐ తెలిపింది. బ్యాంక్‌ల నుంచి అంబూలెన్సీ సేవలను అందించనున్నట్లు వెల్లడించింది. ఈ క్రమంలోనే కేర్ హాస్పిటల్స్‌కు అత్యవసర స్పందన అంబూలెన్సీ వాహనాన్ని శెట్టి అందించారని పేర్కొంది. ఆర్థిక, భౌతిక, సామాజిక సవాళ్లను ఎదుర్కొంటున్న వారికి అండగా నిలువడమే ఎస్బిఐ విధానమని శెట్టి పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు సిఎస్ఆర్ కార్యక్రమాల కింద ఎస్బిఐ రూ.2 కోట్ల సాయం చేసిందని ఆ బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ అమిత్ జింగ్రాన్ తెలిపారు. ఇందుకోసం మరో రూ.2 కోట్లు వ్యయం చేయనున్నట్లు వెల్లడించారు.