Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధాన్యం సేకరణపై బీజేపీ డ్రామాలు : సీఎం కేసీఆర్
- పంట మార్పిడితోనే అధిక దిగుబడులు
గద్వాల ఎమ్మెల్యే తండ్రి దశదిన ఖర్మకు హాజరు
- తిరుగు ప్రయాణంలో పంటలను పరిశీలించిన సీఎం
నవతెలంగాణ - పెబ్బేరు / కొత్తకోట / ధరూర్
కేంద్రంలోని దొంగలు వరిని కొంటలేరని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు అన్నారు. ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు సీఎంను కోరగా పై విధంగా స్పందించారు. అందుకని ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని సూచించారు. పంట మార్పిడితోనే అధిక దిగుబడులు సాధించొచ్చని గురువారం గద్వాల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి తండ్రి దశదిన ఖర్మకు సీఎం హాజరయ్యారు. అనంతరం తిరుగు ప్రయాణంలో వనపర్తి జిల్లా పెబ్బేరు, కొత్తకోట మండలాల్లోని 44వ జాతీయ రహదారి పక్కనున్న రంగాపూర్, విలియం కొండ తండా వద్ద వరితో పాటు వేరుశనగ, పెసర పంటలను సీఎం పరిశీలించారు. వేరుశనగ సాగుకు అయిన ఖర్చు, పంట ఎలా ఉందని రైతులను అడిగి తెలుసుకున్నారు. వరికి బదులుగా ప్రత్యామ్నా య పంటలు సాగు చేయడం ద్వారా మంచి దిగుబడులు వస్తాయని సీఎం చెప్పారు. యాసంగిలో కచ్చితంగా పంట మార్పిడి చేయాలన్నారు. రైతులకు ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందన్నారు. కొత్తకోట మండలం విలియం కొండ స్టేజీ వద్ద రైతులు ఆరబోసిన వరి ధాన్యాన్ని పరిశీలించారు. అలాగే, అక్కడే గిరిజన మహిళలతో కాసేపు ముచ్చటించారు. అంతకుముందు గద్వాల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తండ్రి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఎమ్మెల్యే తల్లి, భార్యతో మాట్లాడి వారిని ఓదార్చారు. సీఎం వెంట మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, ఎమ్మెల్యేలు, ఆయా జిల్లాల కలెక్టర్లు వల్లూరు క్రాంతి, షేక్ యాస్మిన్ భాష, గద్వాల జెడ్పీ చైర్పర్సన్ సరితా తిరుపతయ్య తదితరులున్నారు.