Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇందులో ఉపాధ్యాయ పోస్టులే 18 వేలు
- 443 ఎంఈవో పోస్టుల్లో 17 మందే రెగ్యులర్
- 56 డిప్యూటీఈవోల్లో 52 ఖాళీ
- 21 జిల్లాలకు రెగ్యులర్ డీఈవో పోస్టుల్లేవు
- తుదిదశకు చేరిన కసరత్తు
- రెండు, మూడు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పాఠశాల విద్యాశాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అధికారుల లెక్కతేలింది. రాష్ట్రవ్యాప్తంగా 1.31 లక్షల బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. అందులో ప్రస్తుతం 1.09 లక్షల మంది పనిచేస్తున్నారు. దీంతో పాఠశాల విద్యాశాఖలో 22 వేల ఖాళీలున్నట్టు అధికారులు లెక్కతేల్చారు. ఇందులో ఉపాధ్యాయ పోస్టులు 18 వేలు ఖాళీగా ఉన్నట్టు తెలిసింది. అయితే 2015లో పాఠశాలలు, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. ఆ సమయంలో డీఈవోల పరిధిలో సుమారు 6,500 ఉపా ధ్యాయ పోస్టులను ఉంచింది. ప్రస్తుత గణాంకాల వివరాల్లో వాటిని చేర్చకపోవడం గమనార్హం. ఆ పోస్టులు ఏమయ్యాయి అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతున్నది. డీఈవోల పరిధిలో ఉన్న 6,500 ఉపాధ్యాయ పోస్టులను పాఠశాల విద్యాశాఖ అధికారులు పరిగణనలోకి తీసుకుంటే ఖాళీల సంఖ్య పెరిగే అవకాశమున్నది. కానీ వారు అలా తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తు న్నది. దీంతో ఆ పోస్టులు గల్లంతు అయినట్టేనని ఉపాధ్యాయ సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. డీఈవోల పరిధిలో ఉంచిన ఆయా పోస్టులనూ కలిపి పాఠశాల విద్యాశాఖలో క్యాడర్ స్ట్రెంథ్ లెక్కలు తీయాలని డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అధికారుల లెక్కకు సంబంధించి కసరత్తు తుదిదశకు చేరుకుంది.