Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎంకు టీపీసీసీ వికలాంగుల విభాగం లేఖ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో దళిత బంధు పథకం ప్రవేశ పెట్టారనీ, చట్టం ప్రకారం అందులో ఐదు శాతం అదనంగా దళిత వికలాంగులకు ఇవ్వాలని టీపీసీసీ వికలాంగుల విభాగం చైర్మెన్ ముత్తినేని వీరయ్య కోరారు. ఈమేరకు శుక్రవారం సీఎంకు ఆయన బహిరంగ లేఖ రాశారు. చట్టం ప్రకారం వికలాంగులకు ఐదుశాతం వర్తించేలా వెంటనే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ప్రపంచ వికలాంగుల దినోత్సవంలో సీఎం ఎందుకు పాల్గొనలేదో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక వికలాంగుల సంక్షేమాన్ని విస్మరించిందనీ, దీనిపై బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నగర నాయకులు దేశగాని సతీశ్గౌడ్ ఉన్నారు.