Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దేశ ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశించి రాష్ట్ర మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. కాళేశ్వరం లేదా పాలమూరు-రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఇవ్వాలనీ, ఈ విషయమై గతంలో సీఎం కేసీఆర్ అనేక విజ్ఞప్తులు చేశారని తెలిపారు. అయినా వాటిని కేంద్రం పట్టించుకోలేదన్నారు. ఏపీలోని పోలవరం, కర్నాటకలోని అప్పర్ భద్ర ప్రాజెక్టులను గుర్తించారని వివరించారు. ఈ నెల ఆరున జరుగనున్న హైపర్ పవర్ స్టీరింగ్ కమిటీ మీటింగ్‌లో తమ ప్రాజెక్టులను పరిగణనలోకి తీసుకోవాలని కేటీఆర్ ట్వీట్లో పేర్కొన్నారు.