Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బోయినపల్లి వినోద్ కుమార్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
జాతీయ, రాష్ట్ర స్థాయి వికలాంగుల కమిషన్ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మెన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం హైదరాబాద్లోని నక్లెస్ రోడ్లో వికలాంగుల ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమిషన్ ఏర్పాటుపై ఇటీవల కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్కు లేఖ రాశానని తెలిపారు. మంత్రి సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఉన్నట్టుగానే వికలాంగులకు కూడా జాతీయ , రాష్ట్ర స్థాయి కమిషన్లు ఉండాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో 4 లక్షల 90 వేల 630 మంది వికలాంగులకు ప్రతి నెల రూ. 3,016 చొప్పున పెన్షన్లు ఇస్తున్నామన్నారు. వికలాంగుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కషి చేస్తోందని తెలిపారు.ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి, దైవజ్ఞ శర్మ, వికలాంగుల హక్కుల వేదిక చైర్మెన్ కొల్లి నాగేశ్వరరావు పాల్గొన్నారు.
'అభయ కోట్' ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత
సమాజంలో మహిళలకు ప్రత్యేక భద్రత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. మహిళల రక్షణ కోసం హైదరాబాద్ యువకులు రూపొందించిన 'అభయ కోట్' అనే ప్రత్యేక సేఫ్టీ జ్యాకెట్ ను ఎమ్మెల్సీ కవిత శుక్రవారం ఆవిష్కరించారు.