Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి
- జనగామ జిల్లాలో ఘటన
నవతెలంగాణ-లింగాలఘనపురం
జనగామ జిల్లా లింగాలఘనపురం జనగామ-సూర్యాపేట జాతీయ రహదారిపై వనపర్తి సమీపంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందారు. హైదరాబాద్ శేర్ లింగంపల్లికి చెందిన చిన్న శేఖర్‌రెడ్డి(65), ఆయన భార్య ధనలక్ష్మి(56), కుమారుడు రఘుమారెడ్డి(27)తో కలిసి తిరుమలగిరిలో వాళ్ల బావ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు కారులో వెళ్తున్నారు. వనపర్తి సమీపంలో కారు టైర్ పేలిపోయి కారు అదుపు తప్పి తుమ్మలగూడెం నుంచి జనగామకు వస్తున్న బర్రెల లోడుతో ఉన్న టాటా ఏసీని ఢకొీట్టారు. ఈ సంఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. టాటాఏస్ డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కావడంతో జిల్లా ఏరియా ఆస్పత్రికి తరలించారు. టాటా ఏస్‌లో ఉన్న మూడు గేదెల్లో ఒకటి మృత్యువాతపడగా, మరో రెండింటి పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలసుకున్న ఏసీపీ రఘుచందన, సీఐ వినరుకుమార్, ఎస్ఐ రఘుపతి ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహలను జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.