Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిసెంబర్ 8న క్షేత్రస్థాయి అందోళనలు
- 15న ఢిల్లీలో దీక్షలు
- విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలి
- ఎన్సీసీఓఈఈఈ డిమాండ్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఫిబ్రవరి 1వ తేదీ విద్యుత్ ఉద్యోగులు దేశవ్యాప్తంగా సమ్మె చేయనున్నారు. పార్లమెంటులో విద్యుత్ సవరణల బిల్లు-2021 ఉపసంహరించుకోవాలనే డిమాండ్‌తో ఈ సమ్మెకు వెళ్తున్నారు. ఈ మేరకు జాతీయ విద్యుత్ ఉద్యోగులు, ఇంజినీర్ల సమన్వయ కమిటీ (ఎన్సీసీఓఈఈఈ) పిలుపునిచ్చింది. శుక్రవారం ఢిల్లీలో సమన్వయకమిటీ సమావేశం జరిగింది. శైలేంద్రదూబే, పి రత్నాకరరావు (ఏఐపీఈఎఫ్), ఆర్కె త్రివేది, అభిమన్యు (ఏఐఎఫ్ఓపీడీఈ), మోహన్‌శర్మ, రాణా (ఏఐఎఫ్‌ఈఈ), ప్రశాంత్ చౌదరి (ఇఇఎఫ్‌ఐ), సుభాష్లంబా (ఏఐపీఎఫ్) తదితరులు భేటీ అయ్యారు. మోహన్‌శర్మ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం అనంతరం కన్వీనర్ ప్రశాంత్ ఎన్ చౌదరి ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. సమ్మె సన్నాహకాల్లో భాగంగా డిసెంబర్ 8న దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, జిల్లాలు, మండలస్థాయి విద్యుత్ కార్యాలయాల వద్ద ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయించారు.
డిసెంబర్ 15న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద దీక్షలు నిర్వహిస్తారు. ఈ ఆందోళనలకు భారీ సంఖ్యలో విద్యుత్ ఉద్యోగులు తరలిరావాలని సమన్వయకమిటీ పిలుపునిచ్చింది. ఫిబ్రవరి 1న పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయనీ, ఆరోజు దేశవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు సామూహిక సెలవు పెట్టి వర్క్ బారుకాట్ చేస్తారని తెలిపారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీలను కలిసి విద్యుత్ సవరణ బిల్లును వ్యతిరేకించాలని కోరనున్నట్టు వివరించారు.