Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎంపీటీసీలు, జెడ్పీటీసీలను కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రలోభపెడుతున్నారని ఆరోపిస్తూ బుద్ధభవన్‌లో ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్‌గోయల్‌కు టీఆర్ఎస్ నేతలు శ్రీనివాస్‌రెడ్డి, భరత్ ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో గెలిపిస్తే నజరానా అంటూ జగ్గ్గారెడ్డి ఓటర్లకు ఫోన్లు చేస్తున్నారని సీఈఓ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భం గా వారు మీడియాతో మాట్లాడుతూ..కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారనీ, ఓట్లకు ముందు రూ.50 వేలు, తర్వాత రెండు లక్షల రూపాయలు ఇచ్చేటట్టు పేయిడ్ న్యూస్ వేయిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల ముందే కాంగ్రెస్ పార్టీ పేరిట పేపర్ ప్రకటనలు చేస్తున్నారని చెప్పారు. అలా చేయడం కచ్చితంగా నేరమేనన్నారు. చర్యలు తీసుకోవాలని అధికారిని కోరామని చెప్పారు.