Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గురుకులాల్లోని ఉపాధ్యాయ, ఉద్యోగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల, జేఏసీ గురుకులాల అసోసియేషన్ అధ్యక్షులు సీహెచ్ బాలరాజు ప్రభుత్వాన్ని కోరారు. శనివారం ఈ అంశంపై ఆర్థిక శాఖ మంత్రి టి హరీష్‌రావు,మంత్రి కొప్పుల ఈశ్వర్,ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సురభి వాణిదేవి, టీఎన్జీఒ అధ్యక్షులు మామిళ్ల రాజేందర్‌కు వినతి పత్రం అందజేశారు. పీఆర్సీలో గురుకుల ఉపాధ్యాయులకు జరిగిన అన్యాయాన్ని సవరించాలని ఈ సందర్భంగా వారిని కోరారు.