Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 18న చౌటుప్పల్లో రాష్ట్ర సదస్సు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
విశ్వకర్మ వృత్తి రక్షణ, ఉపాధి గ్యారంటీ, పని భద్రత కోసం ప్రభుత్వం వచ్చే బడ్జెట్ లో వెయ్యి కోట్లు నిధులు కేటాయించాలని చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ కో-కన్వీనర్ లెల్లెల బాల కృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విశ్వకర్మ వృత్తిదారుల సంఘం సమావేశాన్ని సుంకోజు యాదగిరి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ కరోనా కారణంగా గత రెండేండ్లుగా వృత్తి పనులు దెబ్బతిన్నాయనీ, దీంతో విశ్వకర్మల ఉపాధి పూర్తిగా దెబ్బతిన్నదని చెప్పారు. వీరు పట్టణాల్లో కనీసం ఇండ్ల అద్దెలు కూడా చెల్లించలేకపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లల చదువులకు ఫీజులు చెల్లించలేకపోతున్నారన్నారు.వారి పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నా యని విమర్శించారు.సంఘం రాష్ట్ర అధ్యక్షులు కూరెల్ల నరిసింహాచారి మాట్లాడుతూ వృత్తిదారులను ఆదుకోవడానికి ప్రభుత్వం ప్రతి విశ్వకర్మ కుటుంబానికి ప్రతి నెల రూ. 10వేలు ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధన కోసం ఈ నెల 18న చౌటుప్పల్లో విశ్వకర్మ వృత్తిదారుల రాష్ట్ర సదస్సు నిర్వహించనున్నట్టు తెలిపారు.ఈ సదస్సులో భవిష్యత్ పోరాటాలకు రూపకల్పన చేస్తామని ప్రకటించారు.ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి గుంటోజు భీష్మాచారి పాల్గొన్నారు.