Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వరంగల్లో నిర్మించనున్న మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.రెండు వేల పడకలతో నిర్మించనున్న ఈ దవాఖానకు రూ.1,100 కోట్లు మంజూరు చేస్తూ శనివారం వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీ పరిపాలన అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో సివిల్ పనులకు రూ.509 కోట్లు, మంచినీరు, పారిశుధ్యం కోసం రూ.20.36 కోట్లు, మెకానికల్, ఎలక్ట్రిసిటీ, ప్లంబింగ్ పనుల కోసం రూ.182.18 కోట్లు, వైద్య పరికరాల కోసం రూ.105 కోట్లు, అనుబంధ పనుల కోసం రూ.54.28 కోట్లు, చట్టబద్ధమైన పనులు, పన్నుల కోసం రూ.229.18 కోట్ల మేర అనుమతులు ఇచ్చారు. టీఎస్ఎంఐడీసీ, డీఎంఈ ఆధ్వర్యంలో వెంటనే పనులు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు.