Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : రెండు రోజుల జెన్క్వెస్ట్ గ్లోబల్ వర్చువల్ టెస్టింగ్ హ్యాకథాన్ ఆదివారం సాయంత్రంతో ముగిసింది. దేశంలోని అతిపెద్ద టెస్టింగ్ కమ్యూనిటీ అయిన 'ది టెస్ట్ ట్రైబ్' సహకారంతో హైదరాబాద్‌కు చెందిన జెన్‌క్యూ దీనిని నిర్వహించింది. భారత్, అమెరికా, బ్రిటన్, కెనడా, పాకిస్తాన్, మలేషియా, ఫిలిప్పీన్స్, నెదర్లాండ్స్, ఉక్రెయిన్, న్యూజిలాండ్ తదితర 13 దేశాల నుంచి 175 కంపెనీలు నుండి 300 మంది ప్రతినిధులు హాజరయ్యారు. 36-గంటల పాటు నిరన్తతాయంగా కొనసాగింది. ఇందులో పాల్గొనేవారికి సవాళ్లు, పరీక్షించాల్సిన మూడు యాప్‌లు ఇవ్వబడ్డాయి. ఈ సవాళ్లలో ఫైర్క్యాంప్, మనీహోప్, యూనిఫార్మ్ అనే మూడు అప్లికేషన్లను పరీక్షించారు. ఈ మూడు యాప్‌ల యజమానులు తమ ఉత్పత్తికి సంబంధించిన డెమోను ఇచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మూడు అప్లికేషన్లలో మొదటి అత్యుత్తమ ముగ్గురు టెస్టర్లు లేదా గ్రూప్‌లకు గూడీ బ్యాగ్‌లతో పాటు వరుసగా రూ.40,000, రూ.28,000, రూ.18,000 నగదు బహుమతి ఇచ్చారు.