Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరో గురుకులంలో ఇద్దరికి కరోనా
- భయాందోళనలో తల్లిదండ్రులు
నవ తెలంగాణ- గండిపేట/హవేలి ఘనపూర్
రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లాలో ఒకే అపార్ట్మెంట్లో 10మం దికి పాజిటివ్‌గా నిర్థారణ అయింది. గురుకుల పాఠశాలల్లోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దాంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది.
రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ మున్సిపాలిటీ పరిధిలోని పీరం చెరువు గ్రామంలోని గిరిధారి అపార్ట్మెంట్లో పది మందికి కరోనా సోకింది.అపార్ట్‌మెంట్‌కు చెందిన వ్యక్తి ఇటీవలే ఢిల్లీ నుంచి హైదరాబా ద్‌కు వచ్చాడు.ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.అతనితో కలిసిన మరో తొమ్మిది మంది అపార్ట్మెంట్ వాసుల్లో కూడా కరోనా లక్షణాలు కనిపించాయి. వారూ కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దాంతో అపార్ట్మెంట్ వాసులు ఆందో ళనకు గురయ్యారు. శనివారం బండ్లగూడ మున్సిపల్ అధికారులు అపార్ట్మెంట్లో సోడియం హైపోక్లోరెడ్ను పిచికారి చేయించారు.
మెదక్ జిల్లా హవేలీఘనపూర్ మండల కేంద్రంలో ఉన్న మహాత్మా జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలలో శనివారం ఇద్దరు విద్యార్థినులకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. ఈ పాఠశాలలో 450 మంది విద్యార్థినులుండగా ఏడో తరగతికి చెందిన ఇద్దరికి పాజిటివ్ వచ్చినట్టు మండల వైద్యాధికారి డాక్టర్ చంద్రశేఖర రావు తెలిపారు.ఆ తరగతిలోని మిగతా 50మంది విద్యార్థులకూ కరోనా పరీక్షలు నిర్వహించగా అందరకీ నెగిటివ్ వచ్చింది.కరోనా వచ్చిన ఇద్దరు విద్యార్థినులను పాఠశాలలోనే ఐసోలేషన్‌లో ఉంచినట్టు పాఠశాల ప్రిన్సిపాల్ తెలిపారు.