Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గోవా సదస్సులో రవాణామంత్రి పువ్వాడ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, వినియోగాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక రాయితీలు ఇస్తున్నదని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజరుకుమార్ తెలిపారు. గోవా రాష్ట్రంలోని లలిత్ గోల్ఫ్ అండ్ స్పారిస్టార్, కెనకోనాలో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. వివిధ రాష్ట్రాలకు చెందిన రవాణాశాఖ మంత్రులు, ముఖ్య కార్యదర్శులు, పరిశ్రమ ప్రముఖులు, సాంకేతిక నిపుణులు దీనిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో 10వేలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగంలో ఉన్నాయని తెలిపారు. మొదటి రెండు లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు రహదారి పన్ను, రిజస్ట్రేషన్ ఫీజులో వందశాతం మినహాయింపు ఇస్తున్నట్టు తెలిపారు, 20వేల ఆటోలు, 10వేల లైట్ గూడ్స్ వెహికల్స్, ఐదువేల ఎలక్ట్రిక్ కార్లు, మొదటి 500 ఎలక్ట్రిక్ బస్సులకు కూడా ఈ మినహాయింపులు వర్తిస్తాయన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్లకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పలు రాయితీలు ప్రకటించిందని వివరించారు. ప్రజలు కూడా ఎకోఫ్రెండ్లీ వాహనాలపై శ్రద్ధ కనబరుస్తున్నారని చెప్పారు. చార్జింగ్ పాయింట్లపై ఇప్పటికే పూర్తి ప్రణాళిక, ఏర్పాట్లు చేశామని అన్నారు.